గద్వాల జిల్లాలో జరుగుతున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. నాలుగు మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 22.26% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఇందులో ధరూర్ (25.28%), కేటీదొడ్డి (24.97%), గద్వాల (20.06%), గట్టు (19.66%) పోలింగ్ శాతం నమోదైంది.