TG: ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజిబిజిగా ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను రేవంత్ రెడ్డితో సహా మంత్రి వివేక్, టీ కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలుపై వారికి సీఎం వివరించారు. గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియాకి అందించారు.