PPM: వీరఘట్టం మేజర్ పంచాయతీలో కుక్కలు గుంపులు, గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డు పక్కనే చికెన్, మటన్ షాపులు ఉండడంతో అక్కడ మాంసపు ముక్కల కోసం ఎగబడుతున్నాయి. దారినపోయే స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రోడ్డు పక్కన, స్కూల్ సమీపంలో ఉన్న మాంసపు కొట్టులను వేరే ప్రాంతాలకు తరలించాలని స్థానికులు కోరుతున్నారు.