TG: రాష్ట్రంలో తొలి విడతలో 3,384 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తొలివిడత కౌంటింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల భారీ భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత్రం 5 గంటల్లోపు ఫలితాలు వెలువడనున్నాయి.