TG: రాష్ట్రంలో వెలువడుతున్న తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. ఇప్పటివరకు వెలువడిన 1050 గ్రామాల ఫలితాల్లో కాంగ్రెస్ 626 స్థానాల్లో గెలుపొందింది. BRS బలపరిచిన అభ్యర్థులు 236 చోట్ల విజయం సాధించారు. అలాగే, ఇతరులు 144 గ్రామాల్లో జయకేతనం ఎగురవేశారు. బీజేపీ 44 స్థానాల్లో విజయం సాధించింది.