GNTR: తెనాలిలో జరగనున్న ఏపీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ బ్రోచర్‌ను గురువారం సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేశ్ ఆవిష్కరించారు. పోటీల వివరాలను కన్వీనర్, దర్శకుడు దిలీప్ ఆయనకు తెలియజేశారు. ఎంట్రీ ఫీజు లేకుండా నిర్వహించే ఈ పోటీల్లో విజేతలకు జనవరి 4న రూ.50,000 ప్రథమ బహుమతి, రూ.30,000 ద్వితీయ,రూ.20,000 తృతీయ బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు, పర్మినెంట్ షీల్డ్‌ను అందజేస్తారు.