NZB: రబీ సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎడపల్లిలోని జానకంపేటలో సహకార సంఘం ఎరువుల గోడౌన్ను కలెక్టర్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు