ADB: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన పలు మండలాలకు చెందిన 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ కాజల్ సింగ్ గురువారం తెలియజేశారు. వీరిపై ఉట్నూర్, నార్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ప్రజలు, అభ్యర్థులు చట్టాలను కచ్చితంగా పాటించాలని ASP కోరారు.