W.G: వివిధ శాఖలలో పురోగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. కలెక్టరేట్లో గురువారం ఈ పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. మనబడి మన భవిష్యత్తు ఫేజ్ వన్ క్రింద 430 పనులను రూ14.17 కోట్ల వ్యయంతో చేపట్టి నూరు శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు