SDPT: మర్కూక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామ సర్పంచ్‌గా గ్రామానికి చెందిన కొండల్ రెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని, ప్రజల రుణం తీర్చుకోలేనిదని పేర్కొన్నారు.