SRPT: ఆత్మకూరు ఎస్ మండల రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారాయి. మిడ్తనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉప్పుల సురేష్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే తమ గెలుపునకు కారణమని సురేష్ ప్రకటించారు. ఈ ఫలితం స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపి, ప్రత్యర్థి వర్గాలకు గట్టి హెచ్చరిక పంపింది.