కృష్ణా: గన్నవరం అభివృద్ధి కోసం నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్సార్ ఫండ్స్ విరివిగా కేటాయించాలని ఎమ్మెల్యే వెంకట్రావు విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్సీఎల్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. గన్నవరంలో సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ ఏర్పాటుకు సీఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన హెచ్సీఎల్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.