TG: తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని బద్యా తండాలో సర్పంచ్ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. ఒక్క ఓటు తేడాతో ఫలితం తేలింది. రెండోసారి రీకౌంటింగ్‌లో ఒక్క ఓటు తేడాతో BRS మద్దతుదారుడు గెలుపొందారు. అలాగే, ఖమ్మం జిల్లాలో గోపతి, అల్లినగరం గ్రామాల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.