SRPT: ఆత్మకూర్ (ఎస్) మండలం, తుమ్మలపెన్ పహాడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన ఒగ్గు జానకమ్మ ఘన విజయం సాధించారు. ఆమె 1981 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండింది. అనంతరం జానకమ్మ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.