Pdpl: మంథని మండలం విలోచవరం గ్రామ సర్పంచ్‌గా కొండ ప్రేమలత రవీందర్ విజయం సాధించారు. ఆమె తన సమీప అభ్యర్థిపై 178 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. విద్యా వంతురాలు, న్యాయవాది అయిన ప్రేమలతను గ్రామస్తులు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.