దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో 214 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ ఆచితూచి ఆడుతోంది. 10 ఓవర్లు ముగిసేసరికి 81-4 పరుగులు చేసింది. ఓపెనర్ గిల్ (0), సూర్యకుమార్ (5) నిరాశపర్చారు. అభిషేక్ శర్మ (17), అక్షర్ (21) పరుగులు చేశారు. తిలక్ వర్మ (32*), హార్దిక్ (4*) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 60 బంతుల్లో 133 పరుగులు అవసరం.