వైట్‌బాల్ క్రికెట్లో శుభ్‌మన్ గిల్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20లో 2 బంతుల్లోనే ఔటైన గిల్, రెండో T20లో గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. సంజూ శాంసన్‌ను కాదని ఓపెనర్‌గా గిల్‌కు చోటు కల్పించగా, అతడు దారుణంగా విఫలమవుతున్నాడు. దీంతో, గిల్‌ను తప్పించి, శాంసన్‌ను జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.