NZB: ఆర్మూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనాథపురం ఆధ్వర్యంలో గురువారం నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని అధ్యక్షులు శ్రీకాంత్, కోశాధికారి విజయానంద్ తెలిపారు. చలి తీవ్రత ఎక్కువగా ఉందని తగిన జాగ్రత్తలు పాటించాలని వారు నిరాశ్రయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రీజినల్ కో ఆర్డినేటర్ సుధీర్ బాబు, ZC పృథ్వీరాజ్, తదితరులు పాల్గొన్నారు.