మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరు గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బి. స్వర్ణలత ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్ సహకారంతో ఈ విజయం సాధించినట్లు వెల్లడించారు. గతంలో గ్రామంలో చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపించాయన్నారు. మాజీ సర్పంచ్ శ్రీకాంత్ గౌడ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.