కృష్ణా: మోపిదేవి లంకలో అక్రమంగా జూదం ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు జూదం శిబిరంపై ఇవాళ దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2,420/-, సెల్ ఫోన్లు – 4 స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. చట్టా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పమని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.