రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు టీమిండియా ముందు 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, టీ20ల్లో భారత్ ఇప్పటివరకు ఛేదించిన అత్యధిక స్కోరు 209 పరుగులు(ఆస్ట్రేలియాపై) మాత్రమే. దీంతో, ఈ రోజు మ్యాచ్లో గెలిచి టీమిండియా ఈ రికార్డును తిరగరాస్తుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. అయితే, భారీగా మంచు పడుతుండటం, టీమిండియాకు బ్యాటింగ్లో అనుకూలంగా మారే అవకాశం ఉంది.