AP: నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. మేయర్ స్రవంతిపై ఈ నెల 18న అవిశ్వాసం ఉండగా.. ఐదుగురు కార్పొరేటర్లు మాజీ సీఎం, పార్ట్ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. గతంలో టీడీపీలోకి వెళ్లిన వీరంతా.. ఇప్పుడు ‘సొంత గూటికి’ వచ్చేశారు. తాడేపల్లిలో జగన్ వీరికి కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో కీలక సమయంలో టీడీపీ అవిశ్వాస ప్లాన్ దెబ్బతిన్నట్టయింది.