మహబూబ్నగర్ రూరల్ మండలం కోట కదిర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి, జగదీశ్వర్ రెడ్డి ఘన విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా మొదటి దఫ ఎన్నికల ఫలితాలు ఇవాళ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి ఓట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయరన్నారు. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గెలిపించాయన్నారు.