ADB: పంచాయతీ ఎన్నికలలో కేవలం రెండు ఓట్ల తేడాతో ఓ అభ్యర్థి సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని బాబేఝరి గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి పెందూర్ లింగు, తుమ్రం సంతోష్ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఇందులో తుమ్రం సంతోష్‌పై పెందూర్ లింగు అనే యువకుడు 2 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.