GNTR: పొన్నూరులో అంజుమన్ కమిటీ నిర్మించిన నూతన షాపింగ్ కాంప్లెక్స్‌ను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తక్కువ సమయంలో కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేసిన అంజుమన్ కమిటీకి, దాతలకు అభినందనలు తెలిపారు. అంజుమన్ కమిటీ అభివృద్ధికి రూ.2 లక్షల వ్యక్తిగత విరాళం ప్రకటించారు.