Pdpl: కమాన్పూర్ మండలం పేరపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొంగాని సదయ్య విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థిపై 48 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతూ గ్రామంలో పార్టీ ఆధిక్యాన్ని నిలబెట్టారు. కౌంటింగ్ ముగిసిన వెంటనే గ్రామంలో కార్యకర్తలు, అనుచరులు ఆనందం వ్యక్తం చేశారు. సదయ్యకు స్థానికంగా యువత, మహిళల మద్దతు లభించినట్లు తెలుస్తోంది.