Pdpl: మంథనిలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వియోజత్సవ ర్యాలీలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు. కౌంటింగ్ ముగిసిన వెంటనే ర్యాలీలు తీయడం నిబంధనలకు విరుద్ధమని, అలాంటి చర్యలు చేపట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్సై రమేష్ హెచ్చరించారు. అవసరమైతే సంబంధిత అధికారుల అనుమతితో మాత్రమే ర్యాలీలు నిర్వహించవచ్చని తెలిపారు.