ASR: ఇళ్ల యజమానులందరూ ఇంటి పన్ను చెల్లించి, తమకు సహకరించాలని కొయ్యూరు మండలం ఎం.మాకవరం పంచాయతీ అభివృద్ధి అధికారి శివ శంకర్ కోరారు. గురువారం పంచాయతీలో ఇంటింటికీ తిరుగుతూ ఇంటి పన్ను సేకరణ కార్యక్రమం చేపట్టారు. పంచాయతీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇళ్ల యజమానులందరూ పంచాయతీకి ఇంటి పన్ను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.