GNTR: పొన్నూరు శివారులోని VNR ఇంజినీరింగ్ కళాశాలలో రేపు జరగబోయే మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని గురువారం ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ సూచించారు. నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తుందన్నారు. 18-35 సంవత్సరాలు వయసు, టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు.