SRPT: ఆత్మకూరు ఎస్ మండలంలోని ఏపూర్ తండ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బోడ జయరాజు విజయం సాధించారు. ప్రత్యర్థిపై ఆయన 16 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించి, కాంగ్రెస్ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తానని జయరాజు హామీ ఇచ్చారు.