NLR: నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. జిల్లా పరిపాలనలో పారదర్శకత, సమన్వయం, బాధ్యత పెంపు కోసం ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ సూచించారు.