కృష్ణా: తాడిగడపలో ప్రత్యేక హెల్మెట్ డ్రైవ్‌ను DSP శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు గురువారం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారికి రోడ్డు భద్రత ప్రాముఖ్యతను వివరిస్తూ.. ISI మార్క్ హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ట్రాఫిక్ నిబంధనలు, వేగ నియంత్రణ, మొబైల్ వినియోగ ప్రమాదాలు, రాత్రివేళ రిఫ్లెక్టివ్ జాకెట్ల అవసరంపై అవగాహన కల్పించారు.