WG: పాలకొల్లులోని శ్రీ ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్స్ ఆధ్వర్యంలో ప్రతీ నెల మూడవ శనివారం నిర్వహించే స్వచ్చంద స్వర్ణాంధ్ర కార్యక్రమంపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యర్ధాల నిర్వహణ ప్రాముఖ్యత, తడి-పొడి చెత్త వేరుచేయడం, గృహ, కళాశాల స్థాయిలో కంపోస్టింగ్ విధానాలు తదితర అంశాలపై విద్యార్థులకు ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి అవగాహన కల్పించారు.