TG: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో మాజీమంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సత్తా చాటారు. సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్‌గా రామచంద్రారెడ్డి విజయం సాధించారు. 95 ఏళ్ల వయసులో ఆయన సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచారు. దీంతో రాష్ట్ర చరిత్రలో అత్యధిక వయస్కుడైన సర్పంచ్‌గా రామచంద్రారెడ్డి రికార్డు నెలకొల్పారు.