AP: హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఎంపీ విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. మిగతా మతాల ప్రార్థనాలయాల లాగే గుళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలని, ప్రభుత్వ నియంత్రణ ఆర్టికల్ 14కు విరుద్ధమని ట్వీట్ చేశారు. మతాల మధ్య సమానత్వం ఉండాలని, ప్రస్తుత విధానాలపై కేంద్రం పునరాలోచించాలని కోరారు. ఈ విషయంలో హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.