NLR: కావలిలో జిల్లా ఎస్పీ డా.అజిత వేజెండ్ల స్వయంగా వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి, ఆయుధాలు, ఓపెన్ డ్రింకింగ్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. గంజాయి సమాచారం ఇస్తే వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. రాత్రిళ్లు గుంపులుగా తిరిగితే కఠిన చర్యలు ఉంటాయని, అనుమానితులపై 112కి సమాచారం ఇవ్వాలని సూచించారు.