ADB: నార్నూర్ మండలం భీంపూర్ గ్రామపంచాయతీ సర్పంచిగా రాథోడ్ అంకిత రాజు నాయక్ గెలుపొందారు. ప్రత్యర్థి రాథోడ్ విష్ణుపై 360 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. 5 ఏళ్ళ క్రితం ఆమె భర్త రాజు సర్పంచిగా ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. దీంతో మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో 6 జీపీలు ఏకగ్రీవమయ్యాయి.