పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో 82 ఏళ్ల కాసిపేట వెంకటమ్మ విజయం సాధించారు. వయసుపై బడినా గ్రామాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆమె తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, పలు చోట్ల అభ్యర్థులు విజయం సాధించి సంబరాలు చేసుకుంటున్నారు.