WG: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. అవసరమైన ప్రతి ఒక్కరికి రక్తాన్ని అందించేందుకు అన్ని శాఖల ఉద్యోగులు రక్తదాన శిబిరంలో పాల్గొనాలని కోరారు. ఇకపై రక్తం కొరతను తగ్గించేందుకు ఉద్యోగులు ప్రతినెల ఒకటో శుక్రవారం, మూడో శుక్రవారం రక్త దానం చేయాలని కోరారు.