GNTR: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలపై హోంమంత్రి అనితతో అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో 9.5 లక్షల డిపాజిటర్లకు రూ.3,080 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 12 లక్షల మందికి రూ.3 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక నష్టాలతో ఏపీలో 600 మంది, ఇతర రాష్ట్రాల్లో 500 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఈమేరకు బాధితులకు న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.