SRPT: ఆత్మకూర్ (ఎస్)లో బీజేపీ అభ్యర్థి పాటి కరుణాకర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై కేవలం 34 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఆయన గెలుపు పొందారు. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనే తన లక్ష్యమని కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని, తన విజయానికి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.