KRNL: ఆదోనిలోని సిరుగుప్ప క్రాస్ రోడ్డులో ఉన్న ఎన్డీబీఎల్ కాటన్ మిల్లులో గురువారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ఆరా తీశారు. అగ్నిమాప అధికారులతో కలిసి ఆయన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలు మేరకు అన్ని అనుమతులు పొందాలని యాజమాన్యానికి సూచించారు.