మెదక్: టేక్మాల్ మండలం తంపులూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. గ్రామానికి చెందిన దుబ్బగల్ల నాగలక్ష్మి 295 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై గెలుపొందారు. దీంతో దుబ్బగల్ల నాగలక్ష్మి సర్పంచ్ అనుచరులు, బంధువులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు.