WG: వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే సమయంలో ట్రాఫిక్ పోలీసులు విధించే చలానాలు ఇకపై ఫోన్‌పే ద్వారా చెల్లించాలని తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య కోరారు. ఫోన్‌పేలో కొత్తగా ఈ ఛాలాన్ అనే టాబ్ ద్వారా వాహనం నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా వాహనంపై ఉన్న చలానాలు కనిపిస్తాయన్నారు. వాటిని తక్షణమే ఒక సెకన్లో చెల్లించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు.