KKD: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం తుని మున్సిపాలిటీ రెండో వార్డ్ కౌన్సిలర్, పట్టణ వైసీపీ మహిళా అధ్యక్షురాలు చింతల సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రోత్సాహంతో తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన సునీత జగన్ను కలిశారు.