KRNL: కర్నూలు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ కోరారు. 14వ తేదీ లోపు ఖాళీ స్థలాలను యాజమానులు తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని, లేనిపక్షంలో శుభ్రం చేయించి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నగరంలో 325 ఖాళీ స్థలాలను గుర్తించగా 182 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.