కామారెడ్డి మండలం ఇస్రోజీవాడి సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గడ్డం మల్లేష్ గెలుపొందారు. సర్పంచిగా గెలిపించినందుకు గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి ఓటు వేసినందుకు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గడ్డం మల్లేష్ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణులు గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు.