AP: ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా వైద్య సేవల్లో సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఏడుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.