విశాఖలోని రుషికొండలో సీఎం చంద్రబాబు ఈనెల 12 పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు సూచించారు. హిల్–2, 3, 4 ప్రాంతాలు, ఏ1 గ్రాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్యం, సుందరీకరణ, పచ్చదనం చర్యలను ఆయన ప్రత్యక్షంగా గురువారం పరిశీలించారు.