VZM: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరుకు జరుగుతున్న “అభ్యుదయం సైకిల్ యాత్ర” రేగిడి ఆముదాలవలస, సంతకవిటి మండలాల్లో విశేష స్పందనతో గురువారం కొనసాగింది. చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు మాట్లాడుతూ.. డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, సమాజం మొత్తం కలిసి పోరాడితే మాత్రమే గంజాయి నిర్మూలన సాధ్యమన్నారు.